ఇంటర్‌ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల:
తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు.. ఇందులో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. 1,04,886 మంది విద్యార్థులు గ్రేడ్ -ఏ 61,887 మంది గ్రేడ్ -బి సాధించగా.. 1,08,093 మందికి సీ గ్రేడ్ వచ్చింది.కరోనా విస్తృతి నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫలితాల వెల్లడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసింది.ఫలితాలను http://tsbie.cgg.gov.in, http://examresults.ts.nic.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు
ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించారు. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇచ్చారు. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.రిజల్ట్స్ చూసుకోవడానికి క్రింది వెబ్ లింక్ లను క్లిక్ చేయగలరు.
✔Click here for Second Year General Resuls✔Click here for Second Year Vocational Results
✔Click here for Second Year General Bridge Course Results
✔Click here for Second Year Vocational Bridge Course Results
✔Click here to Know your Hall Ticket


If you have any doubt,let me know.