Type Here to Get Search Results !

TSNPDCL Mobile App for electricity bill

సమస్త విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా...
ప్రస్తుత కారోన వైరస్ విజృంభన పరిస్థితుల్లో మా సిబ్బంది మరియు వినియోగదారుల భద్రత దృశ్య ప్రతి ఇంటింటికి వచ్చి మీటర్ బిల్ కొట్టే పరిస్థితులు లేనందున మన విద్యుత్ సంస్థ సెల్ఫ్ బిల్లింగ్ సిస్టమ్ ను TSNPDCL మొబైల్ యాప్ ద్వారా ప్రవేశపెట్టింది. ఈ యాప్ ఉపయోగించి మీయొక్క మీటర్ బిల్ మీరే మీ మొబైల్ లో మీటర్ రీడింగ్ ఫోటో తీసి యాప్ ద్వారా మాకు పంపించ వచ్చును తద్వారా మా సిబ్బంది మీరు పంపిన ఫోటో ద్వారా బిల్ తీసి మీయొక్క మొబైల్ కు sms రూపంలో పంపించడం జరుగుతుంది.ఈ విధంగా ప్రస్తుత పరిస్థితిని అధిగమించుటలో మీరు సంస్థకు సహకారం అందించవచ్చును...
విద్యుత్ సంస్థ సెల్ఫ్ బిల్లింగ్ సిస్టమ్ TSNPDCL మొబైల్ యాప్
మరి సెల్ఫ్ బిల్లింగ్ ఎంటర్ చేయడం ఎలానో చూద్దాం.
దీని కొరకు మీరు క్రింది రెండు యాప్ లు మొదట డౌన్లోడ్ చేయాలి. ఈ లింక్ పై క్లిక్ చేయడంతో మా TSNPDCL యాప్ డౌన్లోడ్ చేయవచ్చును...
MOBILE APP : CLICK HERE https://play.google.com/store/apps/details?id=in.coral.met

PROCEDURE

  1. ఈ లింక్ పై క్లిక్ చేయడంతో భారత్ సెల్ఫ్ మీటర్ రీడ్డింగ్ యాప్ డౌన్లోడ్ చేయవచ్చును...
  2. తర్వాత మీయొక్క డీటెయిల్స్ తో యాప్ లు రెండు లాగిన్ చేయాలి..
  3. ఇప్పుడు TSNPDCL యాప్ ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ పై కనబడే మూడో అప్షన్ సెల్ఫ్ రీడ్డింగ్ అప్షన్ పై క్లిక్ చేయండి.
  4. సబ్మిట్(Submit ) సెల్ఫ్ రీడ్డింగ్ అప్షన్ పై క్లిక్ చేయండి.
  5. ఇప్పుడు మీయొక్క ఎనిమిది అంకెల యూనిక్ సర్వీస్ నెంబర్(USC) ను ఎంటర్ చేయండి.
  6. మీయొక్క సర్వీస్ డీటెయిల్స్ సరిచూసుకొని Confirm బటాన్ పై క్లిక్ చేయండి.
  7. ఇప్పుడు SCAN KWH పై క్లిక్ చేయండి...ఈ అప్షన్ పై క్లిక్ చేయగానే భారత్ సెల్ఫ్ మీటర్ రీడ్డింగ్ యాప్ లోకి వెళ్తారు.
  8. ఇప్పుడు మీ మీటర్ డిస్ప్లే నీ చూపించండి....అప్ ద్వారా స్వయంగా రీడ్డింగ్ తీసుకొనబడును....
  9. రీడ్డింగ్ తీసుకున్నాక మీటర్ లోని KWH రీడ్డింగ్ స్కాన్ ఐనట్టి రీడ్డింగ్ సరిచూసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చును.....
  10. ఈ విధంగా సబ్మీట్ చేసిన సెల్ఫ్ మీటర్ రీడ్డింగ్ కు బిల్ మీయొక్క మొబైల్ కు SMS రూపంలో పంపించబడును...
ఇట్లు.... సదా...మీ సేవకే మీ TSNPDCL సంస్థ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.