SPOKEN ENGLISH
1) మౌనంగా ఉండడం తప్ప ఇంకో దారి లేదు.
There is no other way but to stay quiet.
2) ఈ పెళ్లికి ఒప్పుకోవడం తప్ప ఇంకో దారి లేదు.
There is no other way but to accept this marriage proposal.
3) లాక్ డౌన్ లో ఇంట్లో ఉండడం తప్ప ఇంకో దారి లేదు.
There is no other way but to stay at home during lockdown.
4) నేను ఇదంతా కావాలని చేయలేదు.
I did not do it all deliberately/ intentionally.
5) నేను ఎవరిని కావాలని బాధపెట్టలేను.
I cannot deliberately hurt anyone.
6) వాళ్ళు కావాలనే సాక్ష్యం లేకుండా చేశారు.
They deliberately destroyed the evidence.
7) అతను నన్ను కావాలనే పట్టించుకోవడం లేదు.
He is deliberately ignoring me.
8) అతను నా వైపు అనుమానంగా చూస్తూ ఉన్నాడు.
He is looking at me suspiciously.
9) నా వైపు అనుమానంగా చూడకు.
Don't look at me suspiciously.
10) నువ్వు అతని వైపు ఎందుకు అనుమానంగా చూస్తున్నావు.
Why are you looking at him suspiciously.
11) ఆమె నన్ను అవమానించిందని అది కూడా అందరి ముందు.
She insulted me that too in front of everybody.
12) అతను హైవే మీద కార్ డ్రైవ్ చేస్తున్నాడు అది కూడా లైసెన్స్ లేకుండా.
He is driving a car on the highway that to without licence.
13) నువ్వు పార్టీ కి వెళ్లావు అది కూడా నాకు చెప్పకుండా.
You went to the the party that too without telling me.
14) మా అత్తయ్య ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ నే ఉంటుంది.
My mother-in-law always eats something or the other.
15) ఈ విషయం గురించి నువ్వు ఏదో ఒకటి చేయాలి.
You should do something or the other about it.
16) మనం ఏదో ఒకటి చేసి వాళ్ళకి సహాయం చేయాలి.
We should help them by doing something or the other.
17) నీకు అది ఏదో ఒకరోజు దొరుకుతుంది.
You will get it someday or the other.
18) దిగులు పడకు ఏదో ఒక రోజు నేను ప్రయోజకున్ని అవుతాను.
Don't worry I will be successful someday or the other.
19) అతను ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటాడు.
He will get married someday or the other.
20) ఆమె అతడిని ఏదో ఒక రోజు తప్పకుండా కలుస్తుంది.
She will meet him certainly someday or the other.

If you have any doubt,let me know.