Type Here to Get Search Results !

Download TS Inter 1st year hall tickets for IPE-OCT-2021 from tsbie.cgg.gov.in

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్స్ విడుదల

ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు అంతా రెడీ అయింది. మంగళవారం నుంచి హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉండున్నాయి. కరోనా రూల్స్ కు అనుగుణంగా అధికారులు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇదివరకటి కంటే 430 వరకు పరీక్ష కేంద్రాలు పెరిగాయి. ఈసారి కొత్తగా హాల్టికెట్ మీద కొవిడ్ రూల్స్ కూడా ప్రింట్ చేయించడం గమనార్హం. కరోనా వల్ల ఇంటర్ సెకండియర్ చదువుతున్న స్టూడెంట్లకు ఫస్టియర్ ఎగ్జామ్స్ వచ్చే సోమవారం నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు నవంబర్ 3వ తేదీ వరకు జరగనున్నాయి. గతేడాది ఫీజు కట్టిన 4,59,008 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్క హాజరుకానున్నారు. వీరికోసం 1,769 సెంటర్లను ఏర్పాటు చేశారు. లెక్చరర్లతో పాటు స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్లకు కూడా అధికారులు ఎగ్జామ్స్ డ్యూటీలు వేశారు. అయితే ఈసారి హాల్ టికెట్లపై మాస్కు పెట్టుకోవాలని, పెన్నులు, పెన్సిల్స్, స్కేల్స్ లాంటివి ఇతరుల నుంచి తీసుకోవద్దని, వాటర్ బాటిల్స్ వెంటతెచ్చుకోవాలని, దూరదూరంగా కూర్చోవాలని కరోనా రూల్స్ ప్రింట్ చేశారు. ఇప్ప టికే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారిన సంగతి తెలిసిందే. స్టూడెంట్లలో భయం తగ్గించేందుకు ఇదివ రకటి కంటే రెండింతల ఛాయిస్లు పెంచారు.

హాల్టిటికెట్లు చెక్ చేసుకోండి: ఉమర్ జలీల్

వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ల మీద కాలేజీ ప్రిన్సిపల్ సంతకం లేకున్నా, పరీక్షా కేం ద్రాల్లోకి అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ సూచించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి tsbie. cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవ చ్చని చెప్పారు. హాల్ టికెట్ పై పేరు, ఫొటో, సంతకం, మీడియం, సబ్జెక్టు తదితర అన్ని అంశాలను చెక్ చేసు కోవాలని సూచించారు. ఏమైనా తప్పులుంటే వెంటనే కాలేజీ ప్రిన్సిపల్ కు గానీ, డీఐ ఈఓకు గానీ చెప్పి సరిచే సుకోవాలని చెప్పారు.
For General & Vocational hall ticket:
క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
CLICK HERE For Bridge cource:
క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
CLICK HERE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.