ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఫస్టియర్ మోడల్ పేపర్లు
సెక్రటరీ ఉమర్ జలీల్ హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ మోడల్ క్వశ్చన్ పేపర్లు బోర్డు వెబ్సైట్లో పెట్టామని సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. పోయినేడాది ఫిజికల్ క్లాసులు నిర్వహించకపోవడం వలన 70% సిలబస్తోనే ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పారు. క్వశ్చన్ పేపర్లు, సిలబస్ వివరాలు https:// tsbie.cgg.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. స్టూడెంట్ల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎటువంటి ఒత్తిడి, భయం లేకుండా స్టూడెంట్లు పరీక్షలకు ప్రిపేర్ కావాలని ఉమర్ జలీల్ కోరారు.
ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లకు ఫ్రీగా స్టడీ మెటీరియల్
మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్లలో ఎగ్జామ్స్ భయాన్ని పోగొట్టేందుకు, ఒత్తిడిని తట్టుకొని వారు విజయవంతంగా పరీక్షలు రాసేందుకు గాను ఉచితంగా ఇంటర్ ఫస్టియర్ స్టడీ మెటీరియల్ ను అందుబాటులో ఉంచుతున్నామని ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనాతో స్టూడెంట్లు కొంతకాలం ఫిజికల్ క్లాసులకు దూరమైన నేపథ్యంలో 70 శాతం సిలబస్, 50 శాతం చాయిస్ తో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్టడీ మెటీరియల్ ను tsbie.cgg.gov.in వెబ్సైట్ లో ఉంచనున్నట్లు తెలిపారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత స్టడీ మెటీ రియల్ను ఇంటర్ బోర్డు అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం సెకండియర్లోని విద్యార్థులకు ఈ నెలలోనే ఫస్టి యర్ పరీక్షలను నిర్వహించనున్న నేపథ్యంలో ఈ స్టడీ మెటీరియల్ రూపొందించారు. స్టడీ మెటీరియల్స్ విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి మంగళవారం గన్ఫౌండ్రీలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ స్టడీ మెటీరి యల్ విద్యార్థులకు కరదీపికగా ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, గణితం, భౌతికశాస్త్రం, చరిత్రకు సంబంధించిన స్టడీ మెటీరియల్ మంగళవారం నుంచి www.tsbie.cgg.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుం దని చెప్పారు. మిగతా సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ రెండు మూడు రోజుల్లో అందుబాటులో పెడతామని తెలిపారు. పరీక్షల్లో 50 శాతం చాయిస్ ప్రశ్నలు ఇస్తున్నామని ఇంటర్ బోర్డు కమిషనర్ ఒమర్ జలీల్ పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టుల మోడల్ ప్రశ్నపత్రాలను వెబ్సై ట్లో పెట్టామని, వాటిని డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.
ఇవి చదివితే ఇంటర్ పాస్
ముఖ్యమైన పేపర్లలో ప్రశ్నల సరళి
రసాయనశాస్త్రంలో సెక్షన్ ఏలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, సెక్షన్ బీలో 4, సెక్షన్ సీలో 8 మార్కుల ప్రశ్నలివ్వనున్నారు. సెక్షన్ ఏలో 10 ప్రశ్నలకు మొత్తం రాయాలి. సెక్షన్ బీలో 12 ప్రశ్నలకు 6, సెక్షన్ సీలో 4 ప్రశ్నలకు రెండింటికి సమాధానాలు రాయాలి.
• గణితంలో ఏ, బీ, సీ మూడు సెక్షన్లు ఉండగా.. ఏ సెక్షన్లో 2 మార్కులు, బీ సెక్షన్లో 4, సీ సెక్షన్లో 7 మార్కుల ప్రశ్నలుంటాయి. ఏ సెక్షన్లో 10 ప్రశ్నలకు అన్నింటికీ సమాధానం రాయాలి. బీ సెక్షన్లో 10 ప్రశ్నలకు 5, సీ సెక్షన్లో 10 ప్రశ్నలకు ఐదింటికి సమాధానాలివ్వాలి.
• బోటనీ ఏ సెక్షన్లో 2 మార్కులు, బీ సెక్షన్ లో 4 మార్కులు, సీ సెక్షన్లో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. ఏ సెక్షన్లో 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. బీ సెక్షన్లో 12 ప్రశ్నలకు 6 రాస్తే సరిపోతుంది. సీ సెక్షన్లో 4 ప్రశ్నల్లో రెండింటికి సమాధానాలివ్వాలి.
• భౌతికశాస్త్రంలో ఏ సెక్షన్లో 2, బీ సెక్షన్లో 4, సీ సెక్షన్లో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్ ఏలో పది ప్రశ్నలిస్తారు. అన్నింటికీ సమాధానం రాయాలి. బీ సెక్షన్లో 12 ప్రశ్నల్లో ఆరింటికి, సెక్షన్ సీలో 4 ప్రశ్నలకు రెండింటికి సమాధానాలివ్వాలి.
• అర్ధశాస్త్రం, రాజనీతిశాస్త్రం రెండింటిలో ఏ సెక్షన్లో 10, బీ సెక్షన్లో 5, సీ సెక్షన్ 2 మార్కుల ప్రశ్నలిస్తారు. ఏ సెక్షన్లో 6 ప్రశ్నలకు 3, బీ సెక్షన్లో 16 ప్రశ్నలకు 8, సీ సెక్షన్లో 30 ప్రశ్నలకు 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
ఇంటర్ విద్యార్థుల కోసం రూపొందించిన స్టడీ మెటీరియల్ను గనౌఫౌండ్రీలోని తన కార్యాలయంలో మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తదితరులు
ఇక్కడ క్లిక్ చేసి ఇంటర్ వెబ్సైట్ నుండి స్టడీ మెటీరియల్ ప్రశ్నపత్రాలను పొందండి.👇
If you have any doubt,let me know.