Type Here to Get Search Results !

Telangana SSC New Model Papers-2021|Download pdf

పదో తరగతిలో 6 పేపర్లే 6 పేపర్లే

11 నుంచి ఆరింటికి కుదింపు

పరీక్ష సమయం అరగంట పెంపు

సైన్స్ లో రెండు జవాబు పత్రాలు

70% సిలబస్ కే వార్షిక పరీక్షలు ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం

పదో తరగతి ప్రశ్నపత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఆరు పేపర్లకే వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 11 పేపర్లను ఆరింటికి కుదించింది. పరీక్ష సమయాన్ని కూడా అరగంట పెంచింది. ఇది వరకు విద్యార్థులకు ఒక్కో పేపరక్కు 2.45 గంటలు ఉండగా.. ఈ ఏడాది 3.15 గంటలకు సమయాన్ని పెంచింది. ఈ మేరకు సోమవారం విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది ఫిబ్రవరి మూడోతేదీన జారీచేసిన మెమో - 777 ప్రకారమే 2021-22 ఎస్సెస్సీ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. 70% సిలబస్ కే పరీక్ష లను నిర్వహించనున్నారు. 30% సిలబస్ ను తగ్గిస్తూ మరో మెమో జారీచేశారు. 2020-21లో అమలుచేసిన సిలబస్ నే 2021-22 విద్యాసంవత్సరంలోనూ అమలు చేస్తామని పేర్కొన్నారు.

దాంతో పాటుగా ప్రభుత్వం ప్రశ్నపత్రం విధానానికి సంబంధించి నటువంటి మోడల్ పేపర్స్ ను కూడా విడుదల చేసింది వాటి యొక్క లింక్ క్రింద ఇచ్చాము అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.

ఇక్కడ క్లిక్ చేసి ప్రశ్నపత్రాలను పొందండి.

CLICK HERE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.