Type Here to Get Search Results !

TS TET-2022 HALL TICKETS:KEY|CURRENT AFFAIRS ADDA

TS TET: తెలంగాణ టెట్‌ అభ్యర్థులు అలర్ట్‌.. హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌: కన్వీనర్‌ 🖥️ తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల కన్వీనర్‌ వెల్లడించారు. tstet.cgg.gov.in, link లో హాల్ టికెట్లను అప్లోడ్ చేసినట్లు చెప్పారు. ఈనెల 12న టెట్ జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ వన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 జరగనున్నాయి. హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరులో అక్షర దోషాలు, కులం, లింగం, దివ్యాంగులు.. తదితర వివరాల్లో పొరపాటు ఉన్నట్లయితే పరీక్ష కేంద్రం వద్ద నామినల్ రోల్‌లో మార్చుకోవాలని కన్వీనర్ పేర్కొన్నారు. హాల్‌ టికెట్‌పైన ఫొటో, సంతకం సరిగా లేకపోయినా.. పూర్తిగా లేకపోయినా.. తాజాగా దిగిన ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారి సంతకం చేయించి డీఈఓను సంప్రదించాలని సూచించారు. టెట్‌కు సుమారు 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి కార్యాలయంలో లేదా 040 23120340, 040-23120433 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు.

TS TET-2022 HALL-TICKETS
TS TET-2022 HALLTICKETS CLICK HERE

TS TET Paper-1(Paper code-C)

un official key(Sakshi Paper key):

CLICK HERE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.