మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6,7,8వ తరగతులలో 2022-23 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశ ప్రకటన:
మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బిసి బాల బాలికల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను 6, 7, 8వ తరగతులలో (ఇంగ్లీషు మీడియం) స్టేట్ సిలబస్ లో ఖాళీ సీట్లకు బిసి, ఎస్.సి, ఎటి మరియు ఇబిసి అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పరీక్ష తేది 19-06-2022 నాడు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును.
ముఖ్యమైన తేదీలు:
అంశం | తేది |
దరఖాస్తు మరియు ఫీజు చెల్లించుటకు ప్రారంభ తేది | 16-04-2022 |
దరఖాస్తు మరియు ఫీజు చెల్లించుటకు చివరి తేదీ | 02-06-2022 |
హాల్ టికెట్లు డౌన్ లోడ్ | CLICK HERE |
ప్రవేశ పరీక్ష తేది | 19-06-2022 (10 AM-12 NOON) |
పరీక్ష ఫీజు | రూ.100/- |
ప్రవేశమునకు అర్హత:
- 6వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 సం.లో 5వ తరగతి చదివి ఉండాలి.
- 7వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 సం.లో 6వ తరగతి చదివి ఉండాలి.
- 8 వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 సం.లో 7వ తరగతి చదివి ఉండాలి.
- విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2020 -21 మరియు విద్యా సంవత్సరములలో నిరవధికంగా విద్యను అభ్యసించి ఉండవలెను.
వయస్సు:
- 6వ తరగతికి: 31/08/2022 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సి/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.
- 7వ తరగతికి: 31/08/2022 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సి/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు..
- 8వ తరగతికి: 31/08/2022 నాటికి 14 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సి/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు..
ఆదాయ పరిమితి:
- విద్యార్థుల తల్లిదండ్రుల/సంరక్షకుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000/-
- పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000/- కు మించరాదు..
పాఠశాలలో ప్రవేశము:
- విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది..
- జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి పాత జిల్లాలోని ఏదైనా పాఠశాలల్లో చదువుతూ ఉండాలి
ప్రవేశ పరీక్ష:
- ప్రవేశ పరీక్ష తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం (సైన్సు మరియు సాంఘిక శాస్త్రం) లలో 5, 6, 7వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు ఉంటుంది.
తెలుగు-15
లెక్కలు-30
సామాన్య శాస్త్రం-15
సాంఘిక శాస్త్రం-15
ఇంగ్లీషు-25
మార్కులతో ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది. జవాబులను ఓ.యం.ఆర్.షీట్లో గుర్తించాలి.
పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం:
అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి (అనాథ) మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును.రిజర్వేషన్:
- BC-A:18%
BC-B:26%
BC-C:3%
BC-D:18%
BC-E:10%
SC:15%
ST:5%
EBC/OTHERS:2%
ORPHANS:3%
TOTAL:100%
సీట్ల ఖాళీల వివరాలు:
MJPTBCW 6th-7th-8th CLASSES VACANT SEATS ADMISSIONS | |
---|---|
ONLINE PAYMENT | CLICK HERE![]() |
ONLINE APPLICATION | CLICK HERE![]() |
DOWNLOAD SUBMITTED APPLICATION | CLICK HERE![]() |
NOTIFICATION DETAILES | CLICK HERE![]() |
Download Hall Ticket | CLICK HERE![]() |
MODEL OMR SHEET | CLICK HERE![]() |
Results | CLICK HERE![]() |
Website | CLICK HERE![]() |
MJPTBCW 6th-7th-8th CLASSES VACANT SEATS ADMISSIONS |
If you have any doubt,let me know.