తెలంగాణ ప్రభుత్వం, సెక్రటరీ కార్యాలయం TTWREIS & TSWREIS విద్యాసంస్థల్లో 2022- 23 విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం 6వ, 7వ, 8వ, 9వ తరగతుల్లో ప్రవేశాలకు 2021-22 విద్యాసంవత్సరంలో 5వ, 6వ, 7వ, 8వ తరగతి పూర్తిచేసిన విద్యార్థినీ విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకునే ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రతిభ కనపరిచి సీట్లను సాధించవచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు విధానం జూన్ 20, 2022 నుండి ప్రారంభమైనది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన విద్యార్థులు దరఖాస్తులు సమర్పించడానికి జూలై 4, 2022 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, అర్హత ప్రమాణాలు, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
- TSWREIS కరీంనగర్ & గౌలిదొడ్డి CoE లో తొమ్మిదవ తరగతి రెగ్యులర్ ప్రవేశాల కోసం. అలాగే..
- TTWREIS ఖమ్మం SoE (B) & పరిగి SoE (G) లో ఎనిమిదవ తరగతి రెగ్యులర్ ప్రవేశాల కోసం క్రింది ఖాళీలు
సీట్ల వివరాలు:
- 8వ, 9వ తరగతి ప్రవేశాలకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులు.
- COE అల్గునూర్ కరీంనగర్ జిల్లా పాఠశాలలో -160 సీట్లు.
- COE గౌలిదొడ్డి (G) రంగారెడ్డి జిల్లా పాఠశాలలో - 80 సీట్లు.
- SOE రఘునాధపాలెం (B) ఖమ్మం జిల్లా పాఠశాలలో - 90 సీటు.. ఉన్నాయి.
TTWREIS & TSWREIS విద్యా సంస్థల్లో 2022-23 విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్న సీట్ల కోసం, మరియు రెగ్యులర్ ప్రవేశాల కోసం, అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
- 2021-22 విద్యాసంవత్సరంలో సంబంధిత ముందు తరగతిలో చదివి ఉండాలి.
వయో-పరిమితి:
- ఆగస్టు 31, 2022 నాటికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వరుసగా 6వ, 7,వ, 8వ, 9వ తరగతి ప్రవేశాల కోసం.. 14, 15, 16, 17.. సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అలాగే
- ఆగస్టు 31 2022 నాటికి బిసి మైనారిటీ మరియు ఇతర వర్గాల విద్యార్థులు వరుసగా 6వ, 7,వ, 8వ, 9వ తరగతి ప్రవేశాల కోసం.. 12, 13, 14, 15.. సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ₹.2,00,000/-మించకుండా, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ₹.1,50,000/-మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
- విద్యార్థిని విద్యార్థులు ముందు సంవత్సరం చదివిన తరగతి పాఠశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు, ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.
- పూర్తి సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ ను చదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ దిగువన యున్నది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించాలి.దరఖాస్తు ఫీజు:
₹.100/-.ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
20.06.2022 నుండి,ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
04.07.2022.ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీ:
31.07.2022.అధికారిక వెబ్సైట్:
https://www.tswreis.ac.in/https://www.tgtwgurukulam.telangana.gov.in/

If you have any doubt,let me know.