Type Here to Get Search Results !

General Science Practice bits in telugu:18th-Aug-2022

జనరల్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్-18.08.2022
1. కేంద్రక రహిత సజీవ కణం ఏది?

1) దారునాళం
2) చాలనీ నాళమూలకాలు
3) దృఢకణాలు
4) దవ్వ రేఖ



సమాధానం: 2

2. జతపరచండి.

కణజాలం
i) స్థూలకోణ కణజాలం
ii) దృఢ కణజాలం
iii) దారువు
iv) పోషక కణజాలం
విధులు
a) నిర్జీవ యాంత్రిక కణజాలం
b) సజీవ యాంత్రిక కణజాలం
c) నీటి రవాణా
d) ఆహార పదార్థాల రవాణా

1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-a, iii-c, iv-d
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-c, ii-d, iii-b, iv-a



సమాధానం: 2

3. మొక్కల్లో పార్శ్వ వేర్లు దేని నుంచి ఉద్భవిస్తాయి?

1) బాహ్యచర్మం
2) అంతశ్చర్మం
3) పరిచక్రం
4) దవ్వ



సమాధానం: 3

4.కాస్పేరియన్ మందాలు ఉండటం దేని ముఖ్య లక్షణం?

1) పరిచక్రం
2) బాహ్యచర్మం
3) అంతశ్చర్మం
4) దవ్వ



సమాధానం: 3

5. పారిశ్రామికంగా ఏ మొక్క నుంచి బెండును ఉత్పత్తి చేస్తున్నారు?

1) యూకలిప్టస్
2) ఓక్ వృక్షం
3) రావి
4) వెదురు



సమాధానం: 2

6. బెండు కణాల్లో ఉన్న కణ కవచం దేనితో నిర్మితమవుతుంది?

1) సెల్యులోజ్
2) ఖైటిన్
3) సుబరిన్
4) క్యూటిన్



సమాధానం: 3

7. ఆపిల్‌లో తిన గలిగే భాగ స్వరూపం?

1) మధ్య ఫలకవచం
2) బీజదళాలు
3) పుష్పాసనం
4) అంతః ఫలకవచం



సమాధానం: 3

8. జీడి మామిడి ఫలంలో తిన గలిగే భాగం స్వరూపం?

1) బీజకవచం
2) పుష్పాసనం
3) మధ్యఫలకవచం
4) పుష్పవృంతం



సమాధానం: 4

9. కొన్ని ఫలాలు వాటి తిన గలిగే భాగాలకు సంబంధించి సరైన జత?

ఎ) మృదుఫలం - వంగ → పూర్తి ఫలం
బి) హెస్పరీడియం - నిమ్మ → అంతరఫలకవచం పైన ఉండే రసయుత కేశాలు
సి) టెంక ఉన్న ఫలం - కొబ్బరి → కణ, ద్రవయుత అంకురచ్చదం
డి) లోమేంటం - చింత → పూర్తి ఫలం

1) ఎ, డి
2) ఎ, సి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి



సమాధానం: 3
10. అతిపెద్ద పుష్పాలను ఉత్పత్తి చేసే వేరు పరాన్నజీవి మొక్క?

1) స్ట్రెగా
2) రప్లీషియా
3) ఒరబాంకి
4) సాంటాలమ్



సమాధానం: 2


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.