Type Here to Get Search Results !

తెలంగాణలో వెట్టి మరియు భగేళా వ్యవస్థ

వెట్టి విధానం:

ఒక వ్యక్తికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వకుండా నిర్బంధంగా పనులు చేయించుకోవడం వారితో చాకిరీ చేయించుకొని వారి శ్రమను, జీవితాలను దోచుకునే విధానమే వెట్టి విధానం.

నిజాం సర్కారు చాలా కాలం క్రితమే బలోతదారు అనే పేరుతో కొన్ని వర్గాలను గుర్తించింది. బలోత ఇనాములను కూడా ఇచ్చింది.ఫలితంగా బలోతదారులు గ్రామస్తులకు సేవ చేయాలి.

కాలక్రమంలో భూస్వాముల దుర్బుద్ధి వల్ల వారి భూములు పోయాయి కానీ సేవ మాత్రం వెట్టిచాకిరిలా మారింది నిమ్న కులాలకు చెందిన కుటుంబాలు ముఖ్యంగా దళితులు, భూస్వాములకు 24 గంటలు అందుబాటులో ఉండి వారి ఇండ్లలో పొలాల్లో నిర్బంధంగా పనులు చేయాల్సి ఉండేది దీనినే "వెట్టి చాకిరీ విధానం" అంటారు వెట్టిని "బేగార్" అని కూడా అంటారు భూస్వాములు మహిళలు బాలికలతో కూడా వెట్టిచాకిరి చేయించి వారిని దోపిడీకి గురి చేసేవారు. నిజాం కాలం నాటి వెట్టి గురించి అప్పటి దుబ్బర పరిస్థితుల గురించి ఎం.ఎస్. రాజలింగం తన ఆత్మకథలో విపుళీకరించాడు. 1911లో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ బెగార్, వెట్టిచాకిరిని నిషేధించాడు.

అప్పటి గ్రామాలలోని పెట్టి చాకిరి దృశ్యాలను కొందరు రచయితలు వారి రచనలలో కళ్లకు కట్టినట్లు తెలియజేశారు.

వాటిలో ముఖ్యమైన రచనలు:

బొల్లి ముంతా శివరామకృష్ణ -మృత్యునీడలు
దాశరథి రంగాచార్య -చిల్లర దేవుళ్ళు
వట్టికోట ఆళ్వారుస్వామి-ప్రజల మనిషి, గంగు

ఆంధ్ర మహాసభలోని ప్రథమ, ఆరవ ,ఏడవ ఆంధ్ర మహాసభలలో వెట్టికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు.

బగేలా వ్యవస్థ:

భూస్వాములు భూమిలేని పేద దళితులకు అధిక వడ్డీలకు అప్పు ఇచ్చి నామమాత్రపు వేతనాలకు వారిని పనిలో పెట్టుకుని ఆ అప్పు తీరేవరకు వారి నుండి నిర్బంధ చాకిరీ చేయించుకునేవారు దీనినే బగేలా వ్యవస్థ అంటారు ఈ విధానంలో అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు తీర్చకుండానే మరణిస్తే ఆ అప్పు వారి వారసులకు సంక్రమించి వారు కూడా ఆ అప్పు తీరే వరకు భూస్వాముల వద్ద పనిచేయాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.