కరీంనగర్ సింహగర్జన సభ:
2001 మే 17 న TRS పార్టీ మొదటి బహిరంగ సభను కరీంనగర్ లోని SRR కాలేజీ మైదానంలో సింహగర్జన పేరుతో నిర్వహించారు.
టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కె.సిఆర్, పార్టీ నేతలు మే 17 న ఉదయం 10 గంటలకు జలదృశ్యం నుంచి సుమారు రెండువందల వాహనాలలో ర్యాలీగా బయలుదేరారు. కరీంనగర్లోని సభాస్థలికి సాయంత్రం 6 గంటలకు చేరుకున్నారు.
ఈ కార్ల ర్యాలీకి దారి పొడవునా ప్రజలు నీరాజనం పట్టారు.
ఈ కరీంనగర్ సింహగర్జన సభకు జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు 'శిబు సోరెన్' ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఈ సభలో కెసిఆర్ తోపాటు ఆచార్య జయశంకర్, ఇతర నాయకులు తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ప్రసంగించారు.
ఈ సభలో రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కళాకారులు పాడిన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే తెలంగాణ గీతాలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి.
ఈ సభకు జనం స్పందన చూద్దామని వచ్చిన మాజీ మంత్రి సంతోష్ రెడ్డి (నిజామాబాద్), మరికొందరు నాయకులు అక్కడికక్కడే కె.సి.ఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సభ విజయవంతం కావడంతో ఆందోళన చెందిన చంద్రబాబు నాయుడు అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి సలహాతో ఆగమేఘాలపై వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారానికి 30 కి.మి. దూరంలో గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి 18 నెలలలో పూర్తి చేస్తానని ప్రకటించాడు.
If you have any doubt,let me know.