తెలంగాణలోని భూస్వాముల కోటలను గడీలు అనేవారు.
గడీ అనగా కోట అని అర్థం. గడీ అనునది మరాఠా పదం.
తెలంగాణలో పలుచోట్ల గడీలు ఉన్నాయి. వీటిని ఇసుక, సున్నాలతో కలిపి కట్టేవారు.
గడీ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు అన్నివైపులా బురుజులు ఉండేవి.
భూస్వాములు ఈ గడీ యొక్క వెనుక భాగంలో నివాసం ఉంటూ గడీ ముందు భాగంలో ప్రజలను పిలిపించి వివిధ విచారణలు నిర్వహించేవారు. దీనినే తెలంగాణలో గడీల పాలన అనేవారు.
నిజాం రాజ్యంలో గడీలు పరిపాలన కేంద్రాలుగా, పన్ను వసూలు చేసే కేంద్రాలుగా శాంతిభద్రతల పర్యవేక్షణ కేంద్రాలుగా ఉండేవి.
తెలంగాణలోని ప్రముఖ గడీలు:
విసునూరు గడీ:
నల్లగొండ జిల్లా జనగామ తాలూకాలో ఉండేది. ఈ గడీ యజమాని రాపాక వెంకట రామచంద్రారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో 1946-51 ఈ ప్రాంతం ప్రధాన పాత్ర పోషించింది.రాపాక వెంకట రామచంద్రారెడ్డి
- రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ.
- జానకమ్మ కడవెండిలో ఉండేది.
- అక్కడ ఆమె అనేక దుర్మార్గాలకు పాల్పడేది.
- రామచంద్రారెడ్డి 1935-36 సంవత్సరంలలో విస్నూర్ గడీని నిర్మించాడు.
- ఇతను విలాసవంతమైన జీవితం గడిపేవాడు. దౌర్జన్యాలు చేసేవాడు. రైఫిల్స్, ఫిస్టల్ సమకూర్చుకున్నాడు.
- ఈ గడీ నిర్మాణానికి తన జాగీర్ లోని టేకు ఇతర కలప ఉపయోగించాడు.
- 60 గ్రామాల ప్రజలతో వెట్టి చేయించుకుని విసునూరు గడిని నిర్మించాడు.
- ఈ గడీలో అధునాతన సౌకర్యాలు కల్పించుకున్నాడు.
- బర్మా నుండి టేకు బెల్జియం నుండి అద్దాలు అజంజాహి మిల్స్ నుండి ప్రత్యేక విద్యుత్తు లైను తెప్పించాడు.
- ఆ కాలంలోనే ఇంగ్లాండ్ నుండి కారును దిగుమతి చేసుకున్నాడు.
- సొంతంగా గుండా సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు ఈ విసునూరు దేశముఖ్ సామాన్య ప్రజలనే కాక ముక్తిదారులు చిన్న చిన్న భూస్వాములను కూడా హింసించి లొంగదీసుకునేవాడు
- తెలంగాణ ప్రజల జీవిత పరిశీలనకు వచ్చిన జాతీయ కాంగ్రెస్ నాయకులను రామచంద్ర రెడ్డి తన గదిలో మూడు రోజులపాటు బంధించాడు.
1. వావిలాల గోపాల కృష్ణయ్య
2. నిరీక్షణ రావు
3. భోగాతుల రామారావు
కంఠాత్మకూర్ గడీ:
- నల్లగొండ జిల్లా కంటే ఆత్మకూరులో ఉండేది ఈ గడీ యజమాని-పింగళి ప్రతాపరెడ్డి
- పింగాలి ప్రతాపరెడ్డి పేద రైతుల భూములను వేల ఎకరాలను ఆక్రమించుకున్నాడు
- ప్రజలతో తెల్ల కాగితాలపై వేలిముద్రలు వేయించి దొంగ కాగితాలు సృష్టించే ఇతని అధికారి-వడ్ల పెద్దన్న
- వడ్ల పెద్దన్న అనే గుమాస్తా ఇంట్లో దొంగతనం నేరం మోపి శిక్షించబడిన వ్యక్తి -దానమల్లు.
కల్లెల గడీ:
- ఈ గడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఉంది
- 1936లో ఈ గడీని నిర్మించినది ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు
- ఈ గడీ పాలకులు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు
- ఈ గడి చివరి పాలకుడు ఈ గడిని పాఠశాలకు లీజుకు ఇచ్చాడు.
- తెలంగాణలో కల్లెడ ప్రాంతం అర్చరీ (విలువిద్య)కు కేరాఫ్ అడ్రస్ గా ఉంది.
సంజీవన్ రావు పేట గడీ:
- సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉండేది
- ఈ గడి యజమాని సంజీవన్ రావు దేశముఖ్ ప్రధాని దొడ్డప్ప సంజీవరావుపేట గడి పాలకులు మిగతా గడీల దొరల వలె అరాచకానికి పాల్పడకుండా రైతుల కోసం చెరువుల త్రవ్వించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
పోలంపల్లి గడీ:
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉండేది.
- యజమాని అనభేరి వెంకటేశ్వరరావు.
- అణబెరి వెంకటేశ్వరరావు కుమారుడు- అనభేరి ప్రభాకరరావు.
- అన్న బేరి ప్రభాకరరావు దొర కుటుంబంలో జన్మించినప్పటికీ దొరల వ్యవస్థకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల పక్షాన పోరాటం చేశాడు.
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు.
బేతవోలు గడీ:
- నల్లగొండ జిల్లా బేతవోలు గ్రామంలో ఉండేది.
- యజమాని తడకమల్ల సీతారామచంద్రరావు.
If you have any doubt,let me know.