Type Here to Get Search Results !

DSC-TET SOCIAL STUDIES METHODOLOGY MCQ TEST-1

1/20
చాలా మంది ప్రజలు బ్యాంకులలో డబ్బును ఎందుకు పొదుపు చేస్తారు ? అను ప్రశ్న ఈ క్రింది విద్యా ప్రమాణానికి చెందినది.
1) సమాచార నైపుణ్యం
2) విషయ అవగాహన
3) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
4) ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట
2/20
అమెరికా జరిగిన వర్ణ వివక్షతను నీవు సమర్ధిస్తావా? అను ప్రశ్న ఈ క్రింది విద్యాప్రమాణానికి చెందినది ?
1) సమాచార నైపుణ్యం
2) విషయ అవగాహన
3) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
4) ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్ధం చేసుకుని వ్యాఖ్యానించుట
3/20
ఇండ్ల స్థలాల పంపిణీలో నీకు జరిగిన అన్యాయంను వివరిస్తూ జిల్లా కలెక్టర్కు లేఖ రాయటం అనే కృత్యం ఈ విద్యా ప్రమాణానికి చెందినది ?
1) సమాచార నైపుణ్యం
2)విషయావగాహన
3 )ప్రశంస సున్నితత్వం
4) పటనైపుణ్యం
4/20
మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము
I)సహజీకరణ
2) లాక్షణీకరణము
3) సునిశితత్వము
4) హస్తలాఘవం
5/20
ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ
1) జంతువులు మొక్కల మధ్యగల సంబంధాలను వివరించడం
2) ఆవరణ వ్యవస్థ వర్గీకరణను తెలిపే ఫ్లో చార్టు గీయడం
3 జంతువులు మొక్కల మధ్యగల పరస్పర సంబంధాలను అభినందించటం
4) జీవ అంశాల మధ్య సంబంధాలను పోల్చటం
6/20
జానపదులు - మతం అను పాఠ్యాంశము పూర్తి అయిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఇతరుల యెడల సహానుభూతితో వ్యవహరించటం, ఇతరుల సంస్కృతులు సాంప్రదాయాలను గౌరవించడం వంటి ప్రవర్తనా మార్పులను గమనించారు. ఇవి ఈ క్రింది విద్యా ప్రమాణం యొక్క ప్రభావాన్ని సూచిస్తాయి.
1) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించుట
2) విషయావగాహన
3 ప్రశంస సున్నితత్వం
4) విషయం గురించి వ్యాఖ్యానించుట
7/20
ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు ద్రవ్యం అనే పాఠ్యాంశాన్ని బోధించు సమయంలో ఇటీవల జరిగిన కరెన్సీ మార్పు అనే విషయాన్ని ప్రస్తావించటం ద్వారా సాధించగల్గిన విద్యా ప్రమాణం
1) విషయావగాహన
2) సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట
3) సమాచార నైపుణ్యం
4) ప్రశంస సున్నితత్వం
8/20
డ్రాఫ్ట్ మరియు చెక్కకు మధ్యగల తేడా ఏమిటి? అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశింపబడింది.
1)విషయావగాహన
2) సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట
3) సమాచార నైపుణ్యం
4) ప్రశంస సున్నితత్వం
9/20
ఇచ్చిన దత్తాంశ సమాచారాన్ని ఉపయోగించి పట్టికలు గ్రాఫ్లు తయారు చేయమని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు (7వ తరగతి) విద్యార్థులను ఆదేశించాడు.ఈ కృత్యం క్రింది విద్యా ప్రమాణాన్ని సాధించుటకు సంబంధించినది.
1) సమాచార నైపుణ్యం
2)విషయావగాహన
3) ప్రశంస సున్నితత్వం
4)సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట
10/20
ప్రణాళిక తయారీ, పరిశోధన, రూపకల్పన చేయుట అను అనుబంధ క్రియాత్మక పదాలు జ్ఞానాత్మక ప్రక్రియలోని ఈ వర్గానికి చెందినవి
1) సృష్టించుట
2) మూల్యాంకనం
3) విశ్లేషించుట
4) అవగాహన
11/20
నిర్ధారణ చేయుట, ప్రాగుక్తీకరించుట అను మానసిక సామర్ధ్యాలు ఆర్.సి.ఇ.ఎమ్ ఉపగమంలోని ఈ లక్ష్యానికి సంబంధించినవి.
1) జ్ఞానం
2) అవగాహన
3)వినియోగం
4) సృజనాత్మకత
12/20
వర్షపాతం పై ఒక వారం పేపర్ కట్టింగ్లను వార్తపత్రికల నుండి సేకరించి దానిపై ఒక నివేదిక తయారుచేయుట అను కృత్యం ఈ విద్యాప్రమాణం సాధించుటకు సంబంధించినది.
1) విషయావగాహన
2) ప్రశంస సున్నితత్వం
3 సమాచార నైపుణ్యం
4) సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట
13/20
ఆరవ తరగతి విద్యార్థులు నేటి వ్యవసాయం అను పాఠమును పూర్తిచేసిన పిదప వారి గ్రామంలో పండించే వివిధ రకాల పంటల సమాచారాన్ని సేకరించి వానిపై ఒక నివేదికను తరగతిలో సమర్పించుట అనునది క్రింది సామర్ధ్యాన్ని ప్రతిస్పందిస్తుంది.
1) విషయావగాహన
2) సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట
3)సమాచార నైపుణ్యం
4) సున్నితత్వం ప్రశంస
14/20
విపత్తుల నిర్వహణ - పాఠ్యాంశం పూర్తి అయిన పిదప విద్యార్థి వాటి గురించి కారణాలు, దృష్టాంతాలను వివరించుట క్రింది విద్యా ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది.
1) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
2) సమాచార నైపుణ్యం
3) విషయావగాహన
4) ప్రశంస సున్నితత్వం
15/20
గాయత్రి అనే విద్యార్థి తన గ్రామపటాన్ని ఖచ్చితంగా, చక్కగా గీచి అందులో చిహ్నాలు, పదాలు, మొదలగు వాటిని ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగినది. ఇది మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యం అభివృద్ధిని సూచిస్తుంది.
1) అనుకరణ
2) హస్తలాఘవం
3) సున్నితత్వం
4) సహజీవనం
16/20
అంతర్గత, బాహ్య సాక్ష్యధారాలతో తీర్చునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలుగా గల లక్ష్యము
1) విశ్లేషణ
2) సంశ్లేషణ
3) లాక్షణీకరణము
4) మూల్యాంకనము
17/20
ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికలలో ప్రచురించబడిన వార్తల ఆధారంగా 'మత్తు పదార్థాల దుర్వినియోగం లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడింది.
1) సమాచార నైపుణ్యం
2) ప్రశంస సున్నితత్వం
3) ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించుట
4) సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట
18/20
ఈ క్రింది వానిలో అభ్యాసకుల దృక్పథాలను విస్తృతపరచడానికి దోహదపడేది ?
1) వక్తృత్వం
2) సింపోజియం
3) పానెల్ చర్చ
4) మేధోమథనం
19/20
విద్యార్థుల సృజనాత్మక సామర్ధ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది ?
1) వక్తృత్వం
2) సింపోజియం
3) పానెల్ చర్చ
4) మేధోమధనం
20/20
అర్థశాస్త్ర బోధనకు ఈ పద్ధతి చాలా ప్రభావంతమైనది ?
1) క్రీడా పద్ధతి
2) ప్రాజెక్టు పద్ధతి
3) సిమ్యులేషన్
4) ఉపన్యాస పద్ధతి
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.