Type Here to Get Search Results !

AP/TS-TET Old Results and Certificates

తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ‘టెట్’ నోటిఫికేషన్‌లో టెట్ సర్టిఫికెట్ కు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత నిర్వహించిన రెండు టెట్లతో పాటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011 నుంచి నిర్వహించిన నాలుగు టెట్లలో ఉత్తీర్ణత సాధించిన వారందరి సర్టిఫికేట్లకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ వర్తిస్తుందని ప్రత్యేకంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దీంతో గతంలో రాసిన టెట్లలో అత్యధిక మార్కులు సాధించిన వారికి మేలు జరగనుంది.

కానీ అప్పట్లో రాసిన టెట్ సర్టిఫికేట్గాని దానికి సంబంధించిన టెట్ హాల్టికెట్స్ కానీ చాలా మంది అభ్యర్థుల దగ్గర అందుబాటులో లేవు. ఉమ్మడి ఏపీలో నాలుగు టెట్లు, తెలంగాణ ఏర్పాటైన తర్వాత నిర్వహించిన 2 టెట్ ఎగ్జామ్లలో ఎక్కువ మార్కులు సాధించిన టెట్ ఏదో తెలియక, వాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండా చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు.

అయితే పలు ఎడ్యుకేషనల్ వెబ్సైట్లతో పాటు ఏపీ ప్రభుత్వం అప్పట్లో నిర్వహించిన టెట్ తాలూకు డాటాను భద్రపరిచింది. టెట్ హాల్ టికెట్ లేని వారు ముందుగా టెట్ నిర్వహించిన సంవత్సరం, అభ్యర్థి పేరు, పుట్టిన తేది నమోదు చేసి వివరాలు పొందవచ్చు. అనంతరం సంబంధిత హాల్ టికెట్ నంబర్తో టెట్లో సాధించిన మార్కులు, టెట్ సర్టిఫికేట్ ను పొందవచ్చు. ఇందుకోసం కింద ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేయండి.

అన్ని టెట్ హాల్ టికెట్ల కోసం..

Click Here

టెట్ ఫలితాల కోసం..
http://www.manabadi.co.in/sourceview/APTET/Results/results-list

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.