JOINT SEAT ALLOCATION for the ACADEMIC PROGRAMS offered by the IITs, NITs, IIEST, IIITs and Other-GFTIs for the academic year 2022-23 August 24, 2022
12 నుంచి జోసా కౌన్సెలింగ్
కాలపట్టికను జారీ చేసిన ఐఐటీ బాంబేదేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ ఐటీలు, ట్రిపుల్ టీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి సెప్టెంబరు 12 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారికి ఈ నెల 28వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పరీక్ష ఫలితాలు సెప్టెంబరు 11వ తేదీన వెల్లడవుతాయి. ఆ మరుసటి రోజు నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుందని ఐఐటీ బాంబే ప్రకటించింది. అయితే 20వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ ఉంటుందని, దానివల్ల అభ్యర్థులు తమ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవడానికి వీలవుతుందని ఐఐటీ తెలిపింది. అసలు ప్రక్రియ సెప్టెంబరు 21వ తేదీ నుంచి ప్రారంభమ వుతుంది. ఈ మేరకు బుధవారం ఆరు రౌండ్ల కౌన్సెలింగ్ కాలపట్టికను వెల్ల డించింది. ఆరు రౌండ్ల అనంతరం ఎన్ఐటీలు, ట్రిపుల్ఎస్ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే అక్టోబరు 16 నుంచి 21వ తేదీ వరకు కౌన్సెలింగ్ జరు పుతారు. మరోవైపు సీట్ల భర్తీ నియమ నిబంధనలను (బిజినెస్ రూల్స్) ను కూడా ప్రకటించింది. సీట్లు పొందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.40 వేలు, ఇతరులు రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎన్ ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి. ఆరు రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవీ
1వ రౌండ్ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23న
2వ రౌండ్:సెప్టెంబర 28వ తేదీ
3వ రౌండ్: అక్టోబరు 3
4వ రౌండ్: అక్టోబరు 8వ తేదీ
5వ రౌండ్:అక్టోబరు 12వ తేదీ
6వ రౌండ్ (చివరి): అక్టోబరు 16న
https://josaa.nic.in
If you have any doubt,let me know.