Type Here to Get Search Results !

ఫ్రెంచి రచయిత్రికి సాహిత్య నోబెల్

ఫ్రెంచి రచయిత్రికి సాహిత్య నోబెల్

అనీ ఎర్నో కు బహుమతి ప్రకటన

స్టాక్ హోమ్: ఫ్రెంచి రచయిత్రి అనీ ఎర్నోకు ఈ ఏడాది నోబెల్ సాహిత్య బహుమతి ప్రకటించారు. ఆత్మకథ నవలలు రాయడంతో ప్రారంభించిన 82 ఏళ్ల ఎన్నో జ్ఞాపకాలు రాసేందుకు ఫిక్షనన్ను వదిలిపెట్టారు. ఆమె 20కి పైగా పుస్తకాలు రాశారు. వాటిలో చాలావరకు తన, తన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోని చిన్న చిన్న ఘటనల్లోంచి తీసుకున్న కథలే. లైంగిక విషయాలు, అబార్షన్, అనారోగ్యం, తన తల్లి దండ్రుల మరణం లాంటి విషయాలు వాటిలో ఉన్నాయి. చాలా సరళమైన భాషలో, ఏమాత్రం రాజీ పడకుండా ఎన్నో రాశారని నోబెల్ శాంతి బహుమతి కమిటీ చైర్మన్ ఆండర్స్ ఆల్సన్ తెలిపారు. తన శైలి చాలా సరళంగా ఉంటుందని ఎన్నో చెబుతుంటారు. తాను వివరించే ఘటనల గురించి చాలా తటస్థంగా చూస్తూ, భావోద్వేగాలకు ప్రభావితం కాకుండా ఉంటారు. తండ్రితో తన సంబంధం గురించి రాసిన 'లా ప్లేస్' అనే పుస్తకంలో 'సాంస్కృతిక జ్ఞాపకాలు ఏమీ లేవు, నిందాస్తు తిని ఘనంగా ప్రకటించుకోలేదు. ఈ నిష్పాక్షిక రచనా శైలి నాకు సహజంగానే అబ్బింది' అని రాశారు. ఆమె రాసిన వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకం 'లెస్ అనీస్' (ద ఇయర్స్) 2008లో ప్రచురితమైంది. రెండో ప్రపంచయుద్ధం ముగిసినప్పటి నుంచి ఇప్పటివ రకు తన గురించి, ఫ్రెంచి సమాజం గురించి అందులో ఉంటుంది. ఈ పుస్తకంలో తనను వేరే వ్యక్తిలా 'ఆమె' అని ప్రస్తావించడం విశేషం. ఈ పుస్తకానికి అనేక అవార్డులు లభించాయి. ఎన్నో ఫ్రాన్స్లోని నార్మాండీ. ప్రాంతంలో యెవెటోట్ అనే చిన్న పట్టణంలో 1940లో జన్మించారు. 1901 నుంచి ఇప్పటివరకు 119 మందికి సాహిత్య నోబెల్ పురస్కా రాలు ప్రదానం చేయగా.. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న 17వ మహిళ ఎర్నో.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.