Type Here to Get Search Results !

TET Child Development and Pedagogy MCQ Test-13 in telugu | Practice Questions & Answers

DSC/TET Child Development and Pedagogy MCQ Test-13 in telugu | Practice Questions & Answers

DSC Child Development and Pedagogy MCQ Test-13

Child Development and Pedagogy multiple choice questions and answers for TG/AP TET

శిశు వికాసం-అధ్యాపన శాస్త్రం:

1/20
అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక అంశం
1. ఆకాంక్షాస్థాయి
2. లింగభేదం
3. పరిణతి
4. శారీరక ఆరోగ్యం
2/20
క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
1. బ్రూనర్ - బోధనా సిద్దాంతం
2. వైగోట్ స్కీ - పరికరాత్మక అభ్యసనం
3. కార్ల్జర్ - అనుభవపూర్వక అభ్యసనం
4. మాస్లో - అవసరాల అనుక్రమణిక -
3/20
పిల్లల ఆలోచనలకు, భావాలకు ప్రాధాన్యతనిస్తూ, వారిలో ప్రేరణ కలిగిస్తూ తనతో సమానంగా పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి
1. అనుమతి పూర్వక నాయకత్వం
2. నిర్దేశిత నాయకత్వం
3. సహభాగి నాయకత్వం
4. జోక్యరహిత నాయకత్వం
4/20
కళాశాలకు వచ్చిన తరువాత ఇంట్లో గ్యాస్ స్టౌవ్ సరిగా ఆర్పేశానా లేదా ఇంటికి తాళం సరిగా వేశానా లేదా అని పదే పదే ఆలోచనలు చేసే వ్యక్తి మానసిక రుగ్మత
1. మనోవిక్షిప్తులు
2. దౌర్బల్య ప్రతిచర్యలు
3. సామాన్య వ్యాకులత
4. అనియంత్రిత - నిర్బంధక నాడీ రుగ్మత
5/20
సురేష్ చదవమన్నపుడు సరిగా చదవలేడు. ఇతరులు చదివినది కూడా సరిగా అర్థం చేసుకోలేడు. ఇతనికి ఉన్న అభ్యసన వైకల్యం.
1. డిస్ గ్రాఫియా
2. డిస్ లెక్సియా
3. డిస్ కాల్క్యులియా
4. డిస్ ఫేసియా
6/20
కింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించనిది
1. అనుకరణం
2. స్వాభావీకరణం
3. మూల్యాంకనం
4. హస్తలాఘవం
7/20
వికాసం నవజాత దశలో వేగంగా, బాల్యదశలో తక్కువగా ఉండి తిరిగి కౌమారదశ చేరేనాటికి వేగవంతమవడంలోని వికాస సూత్రం
1. వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు
2. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
3. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4. వికాసం ఒక పరస్పర చర్య
8/20
సంజ్ఞానాత్మక వికాసాన్ని ఇలా కూడా అంటారు.
1. సాంఘిక వికాసం
2. ఉద్వేగ వికాసం
3. నైతిక వికాసం
4. మానసిక వికాసం
9/20
విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరానికి నిర్దేశించబడిన కనీస బోధనా గంటలు
1. 1000
2. 800
3. 1200
4. 900
10/20
ఉపాధ్యాయుడు సమస్యలు, ప్రశ్నలను విద్యార్థుల ముందుంచి వారితో ఆలోచన రేకెత్తిస్తూ, మేథోమథనానికి తావిచ్చి స్వయంగా అభ్యసింప చేసే అభ్యసనం
1. సమస్యాసాధన అభ్యసనం
2. సాంఘిక అభ్యసనం
3. అన్వేషణాత్మక అభ్యసనం
4. పరికరాత్మక అభ్యసనం
11/20
ఏ వ్యక్తిని అధ్యయనం చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచే సమాచారం సేకరించే పద్ధతి
1. అనుదైర్ఘ్య పద్ధతి
2. ప్రయోగ పద్ధతి
3. పరిశీలనా పద్ధతి
4. అంతఃపరిశీలనా పద్ధతి
12/20
శ్యామ్కు వారి కుటుంబ సమావేశంలో పాల్గొనడం ఇష్టం లేదు అలా అని వాళ్ళ అమ్మను నిరుత్సాహపరచడం కూడా ఇష్టం లేదు.ఇక్కడి సంఘర్షణ
1. పరిహార - పరిహార
2. ఉపగమ - ఉపగమ
3. ఉపగమ - పరిహార
4. ద్వి ఉపగమ - పరిహార
13/20
ఎల్. ఎమ్. టర్మన్ ప్రకారం ప్రజ్ఞ అంటే
1. లక్ష్య సాధనవైపు తన ప్రవర్తనను మార్చుకోగలిగే సామర్థ్యం
2. అమూర్త ఆలోచనా సామర్థ్యం
3. భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందే సామర్థ్యం
4. పరస్పర సంబంధాలను నెలకొల్పుకునే వ్యక్తి అంతర్గత శక్తి
14/20
వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే శరీర నిర్మాణ లక్షణం
1. చర్మం రంగు
2. ఆరోగ్యం
3. రక్తపీడనం
4. జుట్టు రంగు
15/20
కోల్బర్గ్ ప్రకారం సంప్రదాయ నైతిక స్థాయికి చెందిన పిల్లవాని నైతిక ప్రవర్తనకు కారణం.
1. తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవడం
2. ఇతరుల ఆమోదం మరియు బహుమతులను పొందడం
3. ఇతరుల ఆమోదం కోసం మరియు తిరస్కరణను తప్పించుకోవడం కోసం
4. స్వయం అంగీకార సూత్రాలు
16/20
నటించడం, అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకునే అభ్యాసకులు
1. శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు
2. దృశ్య అభ్యాసకులు
3. శ్రవణ అభ్యాసకులు
4. మౌఖిక అభ్యాసకులు
17/20
లత యొక్క సంగీత జ్ఞానం ఆమె కారు నడపడానికి ఉపయోగపడక పోవడంలోని అభ్యసన బదలాయింపు
1. అనుకూల బదలాయింపు
2. శూన్య బదలాయింపు
3. ద్విపార్శ్వ బదలాయింపు
4. ప్రతికూల బదలాయింపు
18/20
పియాజె ప్రకారం స్కీమాటాలో మార్పులు రావడానికి కారణం
1. సాంశీకరణం మరియు అనుగుణ్యం
2. అనుగుణ్యం మరియు సమతుల్యత
3. అనుకూలత మరియు సమతుల్యత
4. అనుకూలత మరియు వ్యవస్థీకరణ
19/20
వ్యక్తి వికాసం పై ప్రభావం చూపే భౌతిక కారకం
1. అతడు పెరిగే వాతావరణం
2. అతని బంధువులు
3. మీడియా
4. మతాచారాలు
20/20
పిల్లవాడు తనకు తానుగా పనిని చేయగలిగే వరకు తల్లిదండ్రులు తాత్కాలికంగా సహకారాన్ని అందజేయడం అనేది
1. సహకార అభ్యసనం
2. సామీప్య వికాస మండలం
3. భాగస్వామ్య అభ్యసనం
4. స్కఫోల్డింగ్ (సారువ)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.