Type Here to Get Search Results !

New Courses at Sammakka-Sarakka University|సమ్మక్క, సారక్క వర్సిటీలో కొత్తకోర్సులు

సమ్మక్క, సారక్క వర్సిటీలో కొత్తకోర్సులు

2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి

సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం

2026-27 విద్యా సంవత్సరం నుంచి పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్టు సమ్మక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఐఐటీ హైదరాబాద్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) వంటి ప్రముఖ విద్యాసంస్థల సహకారంతో వీటిని చేపడుతున్నట్టు ములుగులోని ఈ వర్సిటీ డీన్ ఆఫ్ అకడమిక్స్ జి.రాం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కోర్సులు, అర్హతలు ఇలా..

1
ఐఐటీ హైదరాబాద్ సహకారంతో బీటెక్- కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు.
దీనికి ఇంటర్మీడియెట్ ఎంపీసీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
2
బీఎస్సీ (హానర్స్)- కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్
అర్హత: ఇంటర్మీడియెట్ ఎంపీసీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
3
బీఎస్సీ (హానర్స్)- మేథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్.
అర్హత: ఇంటర్మీ డియెట్ ఎంఈసీ లేదా ఎంపీసీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత

టీఐఎస్ఎస్ సహకారంతో..

1
ఎంఏ- పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ (డెవలప్మెంటల్ స్టడీస్).
అర్హత: ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

ఇప్పటికే కొనసాగుతున్న కోర్సులు...

1
బీఎస్సీ (హానర్స్) - ఇంగ్లిష్.
అర్హత: ఇంటర్మీడియెట్ ఏదైనా గ్రూప్ లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
2
బీఎస్సీ (హానర్స్)- ఎకనమిక్స్.
అర్హత: ఇంటర్మీడియట్ ఏదైనా గ్రూప్ లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత

పై కోర్సుల్లో అడ్మిషన్, ఇతర వివరాల కోసం:

1
7382437384, 9347809918 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
admissions@ssctu. ac.in వెబ్సైట్ ను సందర్శించవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.