ఇజ్రాయెల్ 11 వ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్
120 సభ్యుల పార్లమెంటు ఎన్నికలలో ఐజాక్ హెర్జోగ్ (60 సంవత్సరాలు) ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.అతను ఇజ్రాయెల్ యొక్క 11 వ అధ్యక్షుడిగా ఉంటాడు మరియు 2021 జూలై 9 నుండి కార్యాలయ బాధ్యతలు స్వీకరిస్తాడు.
జూలై 2021 లో తన పదవీకాలం పూర్తి కానున్న రెవెన్ రివ్లిన్ తరువాత ఆయన స్థానంలో ఇతను భాధ్యతలు స్వీకరిస్తాడు..
ఇజ్రాయెల్ పశ్చిమ ఆసియాలోని ఒక దేశం మరియు మధ్యధరా సముద్రం యొక్క ఆగ్నేయ తీరంలో మరియు ఎర్ర సముద్రం యొక్క ఉత్తర తీరంలో ఉంది
రాజధాని: జెరూసలేం
కరెన్సీ: ఇజ్రాయెల్ షెకెల్
భారతదేశానికి వాట్సాప్ యొక్క గ్రీవెన్స్ ఆఫీసర్‌గా పరేష్ బి లాల్
పరేష్ బి లాల్‌ను ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ ఫర్ ఇండియాకు గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించారు.
అతని నియామకం ప్రభుత్వం యొక్క కొత్త ఐటి ఆర్డర్‌కు అనుగుణంగా ఉంది, దీనికి గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి అన్ని టెక్ కంపెనీలు గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ మరియు భారతదేశం నుండి చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమించాల్సిన అవసరం ఉంది.
గ్రీవెన్స్ ఆఫీసర్ 24 గంటలలోపు ఫిర్యాదును పరిష్కరించాలి మరియు 15 రోజుల్లో ఫిర్యాదును పరిష్కరించాలి.
వాట్సాప్ యొక్క CEO: విల్ క్యాత్‌కార్ట్.
భారత్‌లో కనిపించిన కరోనా రకానికి పేరు పెట్టిన డబ్ల్యూహెచ్‌వో
భారత్‌లో మొదట వెలుగు చూసిన కరోనా రకానికి ‘డెల్టా వేరియంట్’ అనే పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సోమవారం(మే 31) ఖరారు చేసింది.
సాంకేతికంగా ‘బి.1.617’గా పిలిచే ఈ వైరస్ రకం.. అధికారికంగా 53 దేశాల్లో కనిపించిందని సంస్థ తెలిపింది. దీన్ని ‘ఇండియన్ వేరియంట్’గా పిలవడంపై భారత ప్రభుత్వం ఇటీవల అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.
వైరస్ రకాన్ని అది మొదట వెలుగు చూసిన దేశం పేరుతో పిలవరాదని డబ్ల్యూహెచ్‌వో అంతకుముందే స్పష్టంచేసింది. ఆ అలవాటును మాన్పించే దిశగా సంస్థ చొరవ తీసుకుంది. వైరస్ రకాలను సులువుగా ప్రస్తావించడానికి వీలుగా గ్రీకు వర్ణమాలలోని అక్షరాల పేర్లను ఖరారు చేస్తోంది. ఈ విధానం వల్ల తమ భూభాగంలో కనిపించిన కొత్త రకాల గురించి వెల్లడించడానికి అనేక దేశాలు నిస్సంకోచంగా ముందుకొస్తాయని డబ్ల్యూహెచ్‌వో అధికారులు తెలిపారు.
ఈ కొత్త స్కీము కింద బ్రిటన్‌లో వెలుగు చూసిన రకానికి ఆల్ఫా అని, దక్షిణాఫ్రికాలో తొలుత కనిపించిన వేరియంట్‌కు బీటా అని, బ్రెజిల్‌లో ఉత్పన్నమైన వైరస్ రకానికి గామా అని, భారత్‌లో అంతకుముందు కనిపించిన మరో వేరియంట్‌కు ‘కప్పా’ అనే పేర్లను ఖరారు చేశారు. గ్రీకు వర్ణమాలలో 24 అక్షరాలు ఉన్నాయి. అవన్నీ పూర్తయితే, కొత్తగా వచ్చే కరోనా రకాలకు మరో శ్రేణి కింద పేర్లను పెడతామని అధికారులు తెలిపారు.
వాతావరణ మార్పుల లక్ష్యాలు చేరుకోవాలి :: జీ-7 నేతలకు సీఈవోల విజ్ఞప్తి
వాతావరణ మార్పుల లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాల్సిందిగా జీ-7 దేశాల నేతలకు 70 మందికి పైగా ప్రముఖ కంపెనీల సీఈవోలు గురువారం(జూన్ 10) విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది నవంబరులో బ్రిటన్‌లోని గ్లాస్గోలో 26వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు (సీఓపీ 26) నిర్వహించనున్న నేపథ్యంలో సీఈవోల బృందం ప్రపంచ నేతలకు బహిరంగ లేఖ రాసింది.
ఇందులో మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, దాల్మియా సిమెంట్ ఎండీ, సీఈవో మహేంద్ర సింఘి, ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ తదితరులున్నారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించే అంశంపై కలిసి పనిచేసేందుకు తామంతా సిద్ధమని లేఖలో పేర్కొన్నారు.
భిన్న రంగాల మధ్య సహకారంతో ‘నెట్-జీరో ఎకానమీ (వాతావరణంలోకి కొత్తగా వచ్చి చేరే.. పర్యావరణం నుంచి తొలగించే గ్రీన్‌హౌస్ వాయువుల మధ్య సంతులనం)’కి రూపాంతరం చెందే దిశగా చర్యలను వేగవంతం చేయాలని లేఖలో కోరారు. చాలామంది సీఈవోలు ఇలా ముందుకు రావడం చాలా ముఖ్యమైన చర్యగా ప్రపంచ ఆర్థిక వేదిక ఎండీ డొమినిక్ వారే పేర్కొన్నారు. కాగా ఈనెల 11-13 తేదీల మధ్య బ్రిటన్‌లో 47వ ‘జీ-7’ సదస్సు నిర్వహిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్‌చంద్ర పాండే బాధ్యతల స్వీకరణ
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్‌చంద్ర పాండే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనూప్‌చంద్ర పాండేను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. అనూప్ చంద్ర 1984 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ అధికారి. ప్రస్తుతం సుశీల్ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కాగా, సభ్యులుగా రాజీవ్‌కుమార్, అనూప్‌చంద్ర పాండే ఉన్నారు.
If you have any doubt,let me know.