Type Here to Get Search Results !

Group-2 Indian History MCQ Test-5 | Practice Questions and Answers for SI, Constable,DSC/TET

1/20
క్రిప్సు రాయబారం ఉద్దేశం ఏమిటి?
1) భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని అణచడం
2) భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడం
3) రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయుల్ని సహాయం చేయమని అడగడం
4) భారతదేశానికి డొమీనియన్ ప్రతిపత్తి కల్పించడం
2/20
1940 ఆగస్టులో ఆగస్టు ప్రతిపాదనలు చేసింది ఎవరు?
1) ఎ.వి. అలెగ్జాండర్
2) స్టాఫర్ట్ క్రిప్స్
3) పెథిక్ లారెన్స్
4) లిన్లిథొగో
3/20
1946లో భారతదేశానికి వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్ లేని సభ్యులు ఎవరు?
1) ఎ.వి. అలెగ్జాండర్
2) స్టాఫర్ట్ క్రిప్స్
3) పెథిక్ లారెన్స్
4) లిన్లిథొగో
4/20
రాజ్యాంగసభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
1) 1946 ఆగస్టు
2) 1946 జులై
3) 1946 జూన్
4) 1946 ఏప్రిల్
5/20
1943లో అక్టోబరు 21న భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
1) రాస్ బిహారి బోస్
2) సుభాష్ చంద్రబోస్
3) మానిసింగ్
4) జవహర్లాల్ నెహ్రూ
6/20
1943 అక్టోబరు 21న భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఏర్పాటు చేశాడు?
1) సింగపూర్
2) జపాన్
3) భారతదేశం
4) జర్మనీ
7/20
ఖాన్ అబ్దుల్గఫార్ ఖాన్ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంను దేశంలో ఎక్కడ ప్రబలంగా నడిపాడు?
1) వాయువ్య సరిహద్దు
2) ఈశాన్య సరిహద్దు
3) ఆగ్నేయ సరిహద్దు
4) నైరుతి సరిహద్దు
8/20
చౌరీ చౌరా సంఘటనతో సంబంధం గల ఉద్యమం ఏది?
1) హోంరూల్ ఉద్యమం
2) ఖిలాఫత్ ఉద్యమం
3) సహాయ నిరాకరణ ఉద్యమం
4) ఉప్పు సత్యాగ్రహం
9/20
ఖిలాఫత్ ఉద్యమం ఉద్దేశం ఏమిటి?
1) ప్రత్యేక పాకిస్థాన్ ఏర్పాటు కోసం
2) హిందూ-ముస్లిం సమైక్యత కోసం
3) టర్కీ సుల్తాన్ ఖలీఫా పదవిని పునరుద్ధరించడం కోసం
4) భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడం కోసం
10/20
జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది?
1) 1919 ఏప్రిల్ 6
2) 1919 ఏప్రిల్ 11
3) 1919 ఏప్రిల్ 12
4) 1919 ఏప్రిల్ 13
11/20
జలియన్ వాలాబాగ్ దురంతం జరగడానికి కారకుడు ఎవరు?
1) శాండర్స్
2) హార్డింజ్
3) డయ్యర్
4) మింటో
12/20
గాంధీజీ 1917లో మొదట చేసిన ఉద్యమం చంపారన్ ఉనికికి కారణమైన సంఘటన ఏది?
1) నూలు మిల్లుల కార్మికుల జీతాలు పెంచుట
2) పంటలు పండక శిస్తు కట్టలేని స్థితిలో శిస్తు వసూలు నిలిపివేయుటకు
3) నీలిమందు రైతులకు జరుగుతున్న సమస్యలు తీర్చుటకు
4) బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తొలగించుటకు
13/20
ఏ ఉద్యమంతో 'తీనేకథియా' పద్ధతిని రద్దు చేశారు?
1) 1917 చంపారన్ ఉద్యమం
2) 1918 అహ్మదాబాద్ నూలుమిల్లు ఉద్యమం
3) 1918 గుజరాత్లోని కైరా ఉద్యమం
4) హోంరూల్ ఉద్యమం
14/20
గాంధీజీతో సంబంధంగల ఉద్యమం ఏది?
1) వందేమాతరం
2) హోంరూల్
3) సహాయనిరాకరణ
4) విప్లవాత్మక ఉగ్రవాదం
15/20
1919 మార్చిలో చేసిన రౌలత్ చట్టం (నల్ల చట్టం)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏ రోజును, గాంధీజీ 'జాతిని అవమానించిన దినం' గా పిలుపు నిచ్చాడు?
1) ఏప్రిల్ 6
2) ఏప్రిల్ 9
3) ఏప్రిల్ 12
4) ఏప్రిల్ 23
16/20
1906లో ఎవరి ప్రోత్సాహంతో ముస్లింలీగ్ ఏర్పడింది?
1) మింటో
2) మార్లే
3) చెమ్స్పర్డ్
4) మాంటెగ్
17/20
బ్రిటీష్ ఇండియా రాజధానిని ఎప్పుడు కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు?
1) 1909
2) 1905
3) 1911
4) 1915
18/20
భారతదేశాన్ని ఏ ఇంగ్లాండ్ రాజు 1911లో సందర్శించాడు?
1) నాలుగో కింగ్ జార్జ్
2) అయిదో కింగ్ జార్జ్
3) ఆరో కింగ్ జార్జ్
4) ఏడో కింగ్ జార్జ్
19/20
బెంగాల్ విభజనను ఎప్పుడు రద్దు చేశారు?
1) 1905
2) 1909
3) 1911
4) 1915
20/20
బెంగాల్ విభజనను రద్దు చేసిన ఇంగ్లాండ్ రాజు ఎవరు?
1) నాలుగో కింగ్ జార్జ్
2) అయిదో కింగ్ జార్జ్
3) ఆరో కింగ్ జార్జ్
4) ఏడో కింగ్ జార్జ్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.