Type Here to Get Search Results !

SSC CGL Notification-2026 Out-12256 vacancies

ఎస్ఎస్సీ సీజీఎల్ నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, దేశవా విభాగాల్లో ఖాళీగా ఉన్న 12,256 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు మే 21 నుంచి జూన్ 22 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు/ సెప్టెంబర్లో నిర్వహించే టైర్-I, డిసెంబర్లో జరిగే టైర్-II కంప్యూటర్ బేస్డ్ పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
Event NameImportant dates
అప్లికేషన్ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం21-05-2026
లాస్ట్ డేట్22-06-2026
అఫిషియల్ వెబ్ సైట్https://ssc.gov.in
విభాగంప్రశ్నలుమార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్2550
జనరల్ అవేర్నెస్2550
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్2550
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్2550

పోస్టు పేరు: గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులు.

మొత్తం పోస్టులు: 12,256.

అర్హత:

1
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
2
జేఎస్ఓ పోస్టులకు ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతోపాటు 12వ తరగతి గణితంలో కనీసం 60 శాతం లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
3
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II పోస్టులకు స్టాటిస్టి క్స్/మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, డెమోగ్రఫీ, పాపులేషన్ స్టడీస్, ఆపరేషన్ రీసెర్చ్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
4
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.
5
అదనపు అర్హతలుగా సీఏ, సీఎంఏ, సీఎస్, ఎం.కామ్, ఎంబీఏ (ఫైనాన్స్) లేదా ఎంబీఈ ఉన్నాయి.

వయోపరిమితి:

1
18 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ లకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: 21-05-2026

అప్లికేషన్ ఫీజు:

1
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు రూ.100.
2
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ " బీడీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

లాస్ట్ డేట్: 22-06-2026

సెలెక్షన్ ప్రాసెస్:

1
టైర్-1, టైర్-II కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

టైర్-1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తేదీ: 2026,ఆగస్టు-సెప్టెంబర్ (తాత్కాలికం).

టైర్-II కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తేదీ: 2026, డిసెంబర్ (తాత్కాలికం).

మరిన్ని వివరాలకు:

1
వెబ్సైట్ https://ssc.gov.in ను సందర్శించండి.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ–1):

1
టైర్-1 కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.
2
ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
3
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 50మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు అడుగుతారు.
4
నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధా నానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను టైర్-2 ఎంపికకు మాత్రమే పరిగణిస్తారు. కానీ, అంతిమ మెరిట్ లిస్టులోకలపరు.

టైర్ -1 సిలబస్:

జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్:

1
పోలికలు, సారూప్యతలు, స్పేస్ విజువలైజేషన్, సమస్యల సాధన, అర్థమెటిక్ రీజనింగ్, సంఖ్యా శ్రేణులు, కోడింగ్-డికోడింగ్, వెన్ చిత్రాలు, దాగి ఉన్న చిత్రాలు, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇం టెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్.

జనరల్ అవేర్ నెస్:

1
వర్తమాన అంశాలు, భారతదేశం-పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం, ఆర్థిక రంగం, జనరల్ పాలసీ, శాస్త్రీయ పరిశోధనలు.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:

1
పూర్ణ సంఖ్యలు, దశాంశాలు, భిన్నాలు, శాతాలు, నిష్పత్తి, సగటులు, బారువడ్డీ/చక్రవడ్డీ, లాభనష్టా లు, డిస్కౌంట్, కాలము-పని, కాలము-దూరము, బీజగణితం, జ్యామిట్రీ, క్షేత్రగణితం, త్రికోణమితి, బార్ చార్టులు, పై చార్టులు.

ఇంగ్లిష్ కాంప్రహెన్షన్:

1
గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, రైటింగ్ ఎబిలిటి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.