Type Here to Get Search Results !

Telangana Movement Mcq test-5 in telugu

1/22
జవహర్ లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏ తేదీన శంకుస్థాపన చేశారు?
1) 1955 ఆగష్టు 1
2) 1955 డిసెంబర్ 11
3) 1956 అక్టోబర్ 1
4) 1956 నవంబర్ 1
2/22
కింది వాటిలో సరికానిది ఏది ?
1) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిన్న రాష్ట్రాల ఆవశ్యకతను సమర్థించారు
2) ‘తెలంగాణ ప్రాంతీయ కమిటీ' తొలి వైస్ చైర్పర్సన్ - మాసూమా బేగం
3) 1957లో 'తెలంగాణ మహాసభ’ను స్థాపించారు
4) 'తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్' వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఆర్. ఆమోస్
3/22
డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ మీద తన అభిప్రాయాలను తెలు పుతూ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఒక సుదీర్ఘ లేఖ రాశారు. అయితే నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
1) డి.కె. బారువా
2) హెచ్.ఎన్. బహుగుణ
3) జె.బి. కృపలానీ
4) యు.ఎన్. దేబర్
4/22
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముందస్తు నిర్బంధపు (పి.డి.) చట్టం మేరకు 1969 జూలైలో అరెస్టయిన తర్వాత తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగించిన మహిళా నాయకురాలు ఎవరు?
1) దుర్గా భక్తవత్సల
2) సదాలక్ష్మి
3) రోడా మిస్త్రి
4) సంగం లక్ష్మీబాయి
5/22
జతపరచండి.
కార్యక్రమం: a) తెలంగాణ పోరుయాత్ర
b) తెలంగాణ ప్రజాయాత్ర
c) తెలంగాణ విద్యార్థి రణభేరి
d) తెలంగాణ యుద్ధభేరి
పార్టీ/సంస్థ: i) బి జె పి
ii) సి పి ఐ
iii) ఎ బి వి పి
iv) తెలంగాణ సంఘర్షణ సమితి
1) a–i, b–ii, c–iv, d–iii
2) a–i, b–ii, c–III, d–iv
3) a–ii, b–i, c–iii, d–iv
4) a–iv, b–iii, c–ii, d–i
6/22
1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కింది ఏ సంస్థలోని ఉద్యోగ నియామక సమస్యతో ప్రారంభమైంది?
1) కొత్తగూడెం థర్మల్ విద్యుత్ క్షేత్రం
2) సింగరేణి బొగ్గు గనులు
3) నిజాం చక్కెర కర్మాగారం
4) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
7/22
తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన కింది కార్యక్రమాలను సరైన వరుస క్రమంలో అమర్చండి.
ఎ) ‘తెలంగాణ ప్రజాఫ్రంట్'ను గద్దర్ ఏర్పాటు చేశారు
బి) 'తెలంగాణ ధూం ధాం'ను తొలిసారిగా కామారెడ్డిలో నిర్వహించారు
సి) భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జోడేఘాట్ నుంచి హైదరాబాద్ వరకు ‘తెలంగాణ పోరుయాత్రను’ చేపట్టారు.
డి) భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు ‘పోరు తెలంగాణ' కార్యక్రమాన్ని నిర్వ హించారు
1)బి,ఎ,సి,డి
2)బి,ఎ,డి,సి
3) ఎ,బి,సి,డి
4)సి,డి,బి,ఎ
8/22
జతపరచండి.
జాబితా - I a) అంపశయ్య నవీన్
b) సంగిశెట్టి శ్రీనివాస్
c) దేవులపల్లి రామానుజరావు
d) మాదిరెడ్డి సులోచన
జాబితా - II i) పంతులమ్మ
ii) వేగుచుక్కలు
iii) కాలరేఖలు
iv) షబ్నవీస్
1) a–iii, b–iv, c–ii, d–i
2) a–iv, b–iii, c–ii, d–i
3) a–i, b–ii, c–III, d–iv
4) a–iii, b–iv, c–i, d–ii
9/22
కె. అచ్యుతరెడ్డి ఎవరిని ఓడించి తెలంగాణ ప్రాంతీయ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నిక య్యాడు?
1) బి.వి. గురుమూర్తి
2) మీర్ మహమ్మద్ అలీ ఖాన్
3) రావి నారాయణరెడ్డి
4) బద్దం ఎల్లారెడ్డి
10/22
2002లో రాష్ట్ర ప్రభుత్వం జి.ఒ. నెం. 610ను అమలు పరచిన తీరును పరిశీలించ డానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఏది?
1) జయభారత్ రెడ్డి కమిషన్
2) జె.ఎం. గి౯గ్లానీ కమిషన్
3) కె.ఆర్. ఆమోస్ కమిషన్
4) పురుషోత్తమరావు కమిషన్
11/22
తెలంగాణ నాయకుల్లో మొదట ‘విశాలాంధ్ర’ను సూచించిన వారెవరు?
1) గులామ్ రసూల్ ఖాన్
2) జె.వి. నరసింగరావు
3) దేవులపల్లి రామానుజరావు
4) కె.వి. రంగారెడ్డి
12/22
కింది వాటిలో ఏయే రాజకీయ పార్టీలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించలేదు?
1) బిజెపి., ఎస్.పి
2)సిపిఐ(ఎం),బిజెపి
3) సి పి ఐ(ఎం),యం ఐ యం
4) సి పి ఐ(ఎం),బి ఎస్ పి
13/22
1948 జూన్లో భారత ప్రభుత్వం నియ మించిన భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ అధ్యక్షుడు ఎవరు?
1) ఎస్.కె. పాటిల్
2) ఎస్.కె. ధార్
3) పటాస్కర్
4) పి.ఎన్. హస్కర్
14/22
ప్రతిపాదన (A): 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.ఆర్.ఎస్.
18 శాతం ఓట్లు సంపాదించి అబ్బుర పరిచింది
కారణం (R): అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంపై నెలకొన్న అధికారిక నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కె. చంద్రశేఖర్ రావు తెలుగు దేశం పార్టీని వదిలి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించాడు
1) A, Rలు సరైనవి, R అనేది Aకు సరైన వివరణ
2) A, Rలు సరైనవి, R అనేది Aకు సరైన వివరణ కాదు
3) A సరైంది, R సరైంది కాదు
4) A సరైంది కాదు, R సరైంది
15/22
2011లో సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ (సి.ఎస్.ఎస్.) అనే సంస్థ నిర్వ హించిన ప్రజాభిప్రాయ సేకరణ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
1) రాజ్దీప్ సర్దేశాయ్
2) యోగేంద్ర యాదవ్
3) ప్రణయ్ రాయ్
4) అర్నబ్ గోస్వామి
16/22
కింది వాటిలో సరికాని జత?
1) పల్లె కన్నీరు పెడుతుంది-గోరెటి వెంకన్న
2) జయ జయహే తెలంగాణ - అందెశ్రీ
3) ఊరుమనదిరా - చాడ అంజయ్య
4) అమ్మ తెలంగాణమా - గద్దర్
17/22
పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కింది వాటలో ఏ శాఖల్లో రెండింటిని తెలంగాణ వారికే కేటాయించాలి?
1) హోం, ఆర్థిక, రెవెన్యూ, విద్య, వాణిజ్యం పరిశ్రమలు
2) హోం, రెవెన్యూ, పరిశ్రమలు, విద్య, ప్లానింగ్
3) హోం, ఆర్థిక, రెవెన్యూ, ప్లానింగ్, అభివృద్ధి, వాణిజ్యం, పరిశ్రమలు
4) ఆర్థిక, విద్యుచ్ఛక్తి, పరిశ్రమలు, విద్య, రూరల్ డెవలప్మెంట్
18/22
నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) 1969 జనవరి 18, 19 తేదీల్లో అఖిల పక్ష సమావేశం ఆనంద నిలయంలో
2) అఖిల పక్ష నిర్ణయాలను అమలు చేయ డానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఒ. నెంబర్ 39ను విడుదల చేసింది
3) ఐ.జె. నాయుడు, ఆర్. విఠల్ రావులను అఖిల పక్ష సమావేశ నిర్ణయాలను అమలు పరచడానికి నియమించారు
4) తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 1969 జనవరి 23న కుమార్ లలిత్ కమిటీని నియమించింది
19/22
తెలంగాణపై ఆంధ్ర పాలక వర్గపు రాజకీయ ఆధిక్యత ఫలితంగా:
1) రెండు ప్రాంతాలూ అభివృద్ధి ఫలాలు పొందాయి
2) ప్రత్యేక ఆర్థికాభివృద్ధి మండలాలు ఏర్పాటయ్యాయి
3) వ్యవసాయం నుంచి ఆదాయం పెరిగింది
4) తెలంగాణ ప్రజలు కేవలం ప్రేక్షక వర్గంగా నిలిచిపోయారు
20/22
‘తెలంగాణ మేధావుల వేదిక' ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. కింది వాటిలో ఆ సదస్సు ప్రధాన కార్యక్రమం ఏది?
1) ప్రతి జిల్లా కేంద్రానికి రైతు యాత్ర చేపట్టింది
2)'ఛలో అసెంబ్లీ' కార్యక్రమం నిర్వహించింది
3) తెలంగాణ ప్రజలకు 'స్టేట్మెంట్ ఆఫ్ అజెండా’ను ప్రకటించింది
4) ఎలక్ట్రిసిటీ బోర్డుకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టింది
21/22
కింది వాటిలో సరికాని జత?
1) తెలంగాణ అమరవీరుల దినం 1969 మే 17
2) తెలంగాణ నిరసన దినం 1969 జూన్ 2
3) తెలంగాణ వంచన దినం 1969 ఏప్రిల్ 20
4) తెలంగాణ మహిళా దినం 1969 జూన్ 17
22/22
హైదరాబాద్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిం చకుండా, స్టేట్స్ రీ - ఆర్గనైజేషన్ కమిటీకి దానికి అనుగుణంగా విజ్ఞాపనను అందజేసింది ఎవరు?
1) పండిత్ నరేంద్రజీ
2) పండిత్ వినాయక రావు
3) గోపాల రావు ఎక్బోటే
4) కొత్తూరు సీతయ్య గుప్త

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.