Type Here to Get Search Results !

TG TET BIOLOGY MCQ QUIZ-2

1/30
రాజుకు రే చీకటి ఉందని డాక్టర్ నిర్ధారించాడు. మరి రాజు కిందివాటిలో దేనికి సంబంధించి ఉంటాడు?
1) ఎక్కువ వెలుతురు, రాత్రుల్లో వస్తువు లను చూడలేడు.
2) రంగు వస్తువులను, పగటిపూట వస్తువు లను చూడలేడు.
3) తక్కువ వెలుతురులో, రాత్రిపూట వస్తువులను చూడలేడు.
4) రాత్రిపూట వస్తువులను చూస్తాడు, పగటిపూట వస్తువులను చూడలేడు.
2/30
మలేరియా పరాన్నజీవి జీవిత చక్రానికి సంబంధించి సరైంది?
1) లైంగిక చక్రం దోమలో జరుగుతుంది. అలైంగిక చక్రం మానవుడిలో జరుగుతుం ໖.
2) లైంగిక, అలైంగిక చక్రాలు మానవుడి లో జరుగుతాయి.
3) అలైంగిక చక్రం దోమలో జరుగుతుంది. లైంగిక చక్రం మానవుడిలో జరుగు తుం ໖.
4) లైంగిక, అలైంగిక చక్రాలు అవకాశాన్ని బట్టి వేటిలోనైనా జరగవచ్చు.
3/30
అండకోశానికి సంబంధించిన కణాలే ఒక దాని తో ఒకటి సంయోగం చెంది ఏర్పడే కణం?
1) సంయుక్త బీజం
2) ద్వితీయ కేంద్రకం
3) అంకురచ్ఛదం
4) ప్రతిపాద కణం
4/30
మొక్క ఆహార కర్మాగారంగా దేన్ని పేర్కొంటారు?
1) విత్తనం
2) అండకోశం
3)వేరు
4) పత్రం
5/30
ప్రొజెస్టిరాన్ హార్మోన్ పని?
1) గ్లైకోజన్లను గ్లూకోజ్ మార్చడం.
2) గాయిటర్ రాకుండా కాపాడడం.
3) గర్భాశయ పెరుగుదల, జరాయువు
4)ఏర్పడడం.
6/30
సహజ శత్రువులైన కీటకాలను ప్రవేశపెట్టి కలుపు మొక్కలను నాశనం చేసే పద్ధతి?
1) బ్రాడ్కాస్టింగ్ పద్ధతి
2) జీవక్రియా విధాన పద్ధతి
3) భౌతిక పద్దతి
4) రసాయన పద్ధతి
7/30
స్పర్శ గ్రాహకాలు ఏ భాగాలపై ఎక్కువగా ఉం టాయి?
1) వేళ్ల కొనలపై
2) నొసటి ప్రాంతంలో
3) పెదవులపై
4) 1, 3
8/30
కిందివాటిలో ఏ రుచికి చెందిన గ్రాహకాలు నాలుక వెనుక భాగంలో ఉంటాయి?
1) తీపి
2) ఉప్పు
3) పులుపు
4)చేదు
9/30
పాములు వాటి శాస్త్రీయ నామాలకు సంబం ధించి సరైన జత?
ఎ) తాచుపాము - రస్సెల్స్ వైపర్
బి) కట్లపాము - ఓఫియోఫెగస్ హెన్న
సి) ఎకిస్ కారినేటా- సాస్కేల్ వైపర్
డి) రక్తపింజర- బంగారస్ ఫాసియేటస్
1) ఎ , సి
2)సి , డి
3) బి , డి
4) ఎ , డి
10/30
చిన్న పిల్లల్లో అతి సామాన్యంగా కలిగే చర్మ వ్యాధి గజ్జిని కలిగించే క్రిమి ఏ వర్గానికి చెందింది?
1) ప్లాటి హెల్మింథిస్
2) ప్రోటోజోవా
3) ఆర్థ్రోపొడా
4) నిమాటిహెల్మింథిస్
11/30
కిందివాటిలో వేటిని బయోఎరువులుగా ఉపయోగిస్తారు?
1) ఆకుపచ్చ శైవలాలు
2) నీలి ఆకుపచ్చ శైవలాలు
3) గోధుమ వర్ణపు శైవలాలు
4) పైవన్నీ
12/30
'రూబియోలా' అనే మరో పేరు కలిగిన వ్యాధి?
1) ఆటలమ్మ
2) తట్టు (పొంగు)
3) పోలియో (శిశు పక్షవాతం)
4) గవద బిళ్లలు
13/30
అలిసిపోవడం, శ్లేష్మంతో కూడిన దగ్గు, బరువు తగ్గడం వంటి లక్షణాలను గుర్తించిన డాక్టర్ ఆ వ్యాధిగ్రస్తుడికి ఏ వ్యాధి ఉంది అని నిర్ధారిస్తాడు?
1) కుష్టు
2) క్షయ
3) మలేరియా
4) కోరింత దగ్గు
14/30
కిందివాటిలో ఏ రెండు ప్రవచనాలు సరైనవి?
ఎ)చింతకాయ, మామిడి, నిమ్మ మొదలైన వా టిని పొగబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు.
బి) బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడానికి తగిన ఉష్ణోగ్రత 20°C-40°C
సి) ఈస్ట్లు ఆమ్ల ద్రావణంలో వృద్ధి చెందుతాయి.
డి) ఎప్లోటాక్సిన్ కాలేయాన్ని పాడు చేస్తుంది.
1) ఎ, బి
2) సి, డి
3) బి, డి
4) ఎ, సి
15/30
మంచి కలపను ఇచ్చే ఇండియన్ రోజుడ్ శాస్త్రీయ నామం?
1) టిక్టోనియా గ్రాండిస్
2) షారియా రొబస్టా
3) డాల్ బర్జియాలాటి పోలియా
4) అజార్డికా ఇండికా
16/30
కేన్సర్ కు సంబంధించి కిందివాటిలో ఏది సరైనది?
1) మాలిగ్నెంట్ - ఊపిరితిత్తులు ప్రమాదకరం కావు.
2) కార్సినోమా- ఉపకళా కణాలకు వచ్చే కాన్సర్
3) అపాయం చేయని వ్రణాలు కార్సినోమా
4) ఇతర భాగాలకు సోకే గడ్డలు-బిలైన్ గడ్డలు.
17/30
గోళ్లు,రోమాలు, కొమ్ములు వంటి జంతు ని ర్మాణాలు ఏ కణజాలం నుంచి తయార వుతాయి?
1) సంయోజక కణజాలం
2) కండర కణజాలం
3) అస్థి కణజాలం
4) ఉపకళా కణజాలం
18/30
ప్రౌఢ మానవుడిలో ఉండే కుంతకాల సంఖ్య?
1) 4
2) 8
3) 10
4) 12
19/30
మానవుడి జీర్ణ క్రియలో సెల్యులోజ్ తంతువుల ఉపయోగం కానిది?
1) ఆహారానికి బరువును చేకూర్చడం.
2) పేగులో ఆహారం సులువుగా జారేట్లు చేయడం.
3) ప్రొటీన్ల జీర్ణ క్రియలో ఉపయోగపడడం.
4) జీర్ణమైన పోషకాలను సమర్థవంతంగా పీల్చుకునేటట్లు చేయడం.
20/30
ఇతర జంతువులతో పోల్చినప్పుడు నెమరువేసే జంతువుల్లో గ్లూకోజ్ మట్టం ఏ విధంగా ఉం టుంది?
1) అతి ఎక్కువగా
2) సమానంగా
3) అతి తక్కువగా
4) కొలవలేం
21/30
ఈ కిందివాటిలో ఏది ఆంత్ర రసంలో మాత్రమే ఉంటుంది?
1) ఎమిలాప్సిన్
2) ట్రిప్సిన్
3) ఎంటిరోకైనేస్
4) కీమోట్రిప్సిన్
22/30
కిందివాటిలో ఏ జీవి నీలం రంగు రక్తాన్ని కలిగి ఉంటుంది?
1) వానపాము
2)కప్ప
3) నత్త
4) బొద్దింక
23/30
కిందివాటిలో కీటకాహారి మొక్క కానిది?
1) డ్రాసిరా
2) నెపంథిస్
3) డైమోనియా
4) కస్కుటా
24/30
పత్ర రంధ్రాలు తెరుచుకోవడం, మూసు కోవడం కిందివాటిలో ఏ చర్యపై ఆధారపడి ఉం టాయి?
1) విసరణ
2) బాష్పోత్సేకం
3) కిరణజన్యసంయోగక్రియ
4) వేరు పీడనం
25/30
కిందివాటిలో ఏ జీవి ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది?
1) నత్త
2) వానపాము
3) ఈగ
4) చేప
26/30
సాధారణంగా శాఖాహార జంతువుల్లో ఏ దం తాలు లోపిస్తాయి?
1) కుంతకాలు
2) రదనికలు
3) చర్వణకాలు
4) అగ్రచర్వణకాలు
27/30
కిందివాటిలో ఏ జీవి విసర్జక పదార్థంగా యూరికామ్లాన్ని విసర్జిస్తుంది?
1) కప్ప
2) చేప
3) వానపాము
4) బొద్దింక
28/30
పట్టుపురుగులు గొంగళి పురుగులు కింది వాటిలో ఏ రకం భక్షక విధానానికి ఉదా హరణ?
1) ఏకరక భక్షణ
2) బహుళరక భక్షణ
3) జాంతవ భక్షణ
4) సర్వ భక్షణ
29/30
అతినీలలోహిత కిరణాలను శోషణం చేసుకునే వాయువు?
1) ఆక్సిజన్
2) ఆర్గాన్
3) నత్రజని
4) ఓజోన్
30/30
సముద్రంలో ఎంత లోతు వరకు కిరణజన్య సంయోగక్రియ జరపడానికి అవసరమయ్యే కాంతి ఉంటుంది?
1) 500 మిలియన్లు
2) 2000 మిలియన్లు
3) 1000 మిలియన్లు
4) 200 మిలియన్లు
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.